సంస్థాగత నిర్మాణంపై కాంగ్రెస్ ఫోకస్
జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అధిష్టానం చర్యలు చేపట్టిన నేపథ్యంలో, సంస్థాగత నిర్మాణంపై పార్టీ దృష్టి సారించింది. గ్రామ, వార్డు స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో నేతలు నిర్ణయించారు.
బుధవారం కొత్తగూడెంలోని గెస్ట్ హౌస్‌లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోటదేవి ప్రసన్న అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు.
సమావేశానికి ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు రామసహాయం రఘురామిరెడ్డి, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు హాజరయ్యారు.
రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు రూపొందించిన ఆరు అంశాలతో కూడిన అజెండాపై సుదీర్ఘంగా చర్చించి, పార్టీ బలోపేతానికి సంబంధించి పలు తీర్మానాలు చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు చీకటి కార్తీక్, ఇల్లందు మున్సిపల్ చైర్‌పర్సన్ కిరణ్ మిత్ర, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సిరిపురపు లలితా కుమారి తదితరులు పాల్గొన్నారు..


Post a Comment