ఎంపీ వద్దిరాజు రవిచంద్ర చొరవతో పాల్వంచ జామే మసీదులో బోరు ఏర్పాటు

ఎంపీ వద్దిరాజు రవిచంద్ర చొరవతో జామే మసీదులో బోరు ఏర్పాటు

జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం :  పాల్వంచ పట్టణంలోని 37వ డివిజన్ పరిధిలో ఉన్న జామే మసీదులో ఎదురవుతున్న మంచినీటి సమస్యకు పరిష్కారం లభించింది. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చొరవతో మసీదు ప్రాంగణంలో బోరు ఏర్పాటు చేశారు.

ఆదివారం రాత్రి మసీదులో జరిగిన ఇఫ్తార్ విందులో ఎంపీ వద్దిరాజు రవిచంద్రతో పాటు స్థానిక కార్పొరేటర్ మల్లెల స్వప్న కుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంజాన్ ఉపవాస ప్రార్థనల సమయంలో మసీదులో మంచినీటి కొరత ఏర్పడుతున్నదని మసీదు పెద్దలు, బీఆర్ఎస్ రాష్ట్ర  నాయకులు మల్లెల రవిచంద్ర ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు.

దీనిపై వెంటనే స్పందించిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర బోరు వేయించడానికి అవసరమైన నిధులను మంజూరు చేశారు. ఆయన ఆదేశాల మేరకు సోమవారం కార్పొరేటర్ స్వప్న కుమారి ఆధ్వర్యంలో మసీదు కాంప్లెక్స్‌లో బోరు వేయించారు.

ఈ కార్యక్రమంలో మసీదు అధ్యక్షులు ఫయాజ్ అస్లాం, సెక్రటరీ ఇబ్రహీం, కోశాధికారి మీరా సాహెబ్, ఫరూక్, మౌలానా, బీఆర్ఎస్ జిల్లా నాయకులు మల్లెల రవిచంద్ర, మాజీ సహకార సంఘం అధ్యక్షులు బోడెపుడి ప్రసాద్, జి.వి., చలపతి, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

Advertising:


.


Blogger ఆధారితం.