ఏడేళ్లుగా వివాదం..ఎస్పీ రోహిత్ రాజ్ చొరవతో పరిష్కారం
జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం: పాల్వంచ పట్టణంలోని కాంట్రాక్టర్స్ కాలనీలో గణేష్ ఉత్సవ కమిటీలకు సంబంధించిన దాతల విరాళాల వ్యవహారంలో గత ఏడేళ్లుగా పెండింగ్ లో ఉన్న వివాదానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ చొరవతో పరిష్కారం లభించింది. రెండు కమిటీల మధ్య నెలకొన్న సమస్యను ఉభయ పక్షాలకు ఆమోదయోగ్యంగా పరిష్కరించడంతో కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా శనివారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ను సన్మానించారు. సమస్య పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపిన ఎస్పీకి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఎస్పీని కలిసిన వారిలో సకినాల రాములు, సాదం రామకృష్ణారావు, జొన్నలగడ్డ పాల్ రాజా, గంటేటి వెంకటేశ్వరరావు, ధూళిపూడి వెంకటరత్నం, సూద రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment