అజీమ్‌కు శుభాకాంక్షలు తెలిపిన ‘కోనేరు బ్రదర్స్’

అజీమ్‌కు శుభాకాంక్షలు తెలిపిన ‘కోనేరు బ్రదర్స్’

జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కోనేరు చిన్ని సోషల్ మీడియా ఇంచార్జ్ ఎం.డి. అజీమ్ జన్మదినం సందర్భంగా ఆయనకు కోనేరు సత్యనారాయణ (చిన్ని), కొత్తగూడెం క్లబ్ సెక్రటరీ కోనేరు పూర్ణచంద్రరావు శుభాకాంక్షలు తెలిపారు.

శనివారం అజీమ్ జన్మదినాన్ని పురస్కరించుకుని పాల్వంచలోని ఆయన నివాసానికి ‘కోనేరు బ్రదర్స్’ వెళ్లి శాలువాతో సత్కరించి, కేక్ కటింగ్  చేయించారు. అనంతరం  వారు మాట్లాడుతూ 'అజీమ్' భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో టి.ఆర్.వి.కే.ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చారుగుండ్ల రమేష్, టి.ఆర్.వి.కే.ఎస్ రాష్ట్ర జెన్కో సెక్రటరీ ముత్యాల రాంబాబు, టి.ఆర్.వి.కె.ఎస్ జెన్కో అసిస్టెంట్ సెక్రటరీ యం.డి.అమీన్, కార్పొరేటర్ల హరిహరన్ యాదవ్, రావి రాంబాబు, యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.