లవ్ వైరస్ షార్ట్ ఫిలిం 'సాంగ్' ను విడుదల చేసిన సిపి సజ్జనార్

లవ్ వైరస్ షార్ట్ ఫిలిం 'సాంగ్' విడుదల చేసిన సిపి సజ్జనార్

జె.హెచ్.9.మీడియా, హైదరాబాద్ :   స్వయంకృషి క్రియేషన్స్ బ్యానర్‌పై  అరమాస ప్రవీణ్ నిర్మాతగా రూపొందుతున్న ‘లవ్ వైరస్’ షార్ట్ ఫిలిం లోని ‘కుమారి కుమారి’ పాటను హైదరాబాద్ సిపి సజ్జనార్ విడుదల చేశారు. సీనియర్ జర్నలిస్ట్ సయ్యద్ నుమాన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సోమవారం సిపి సజ్జనార్ బంజారాహిల్స్ లోని కమాండ్  కంట్రోల్ సెంటర్ పాటను విడుదల చేసి షార్ట్ ఫిలిం బృందానికి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా సిపి సజ్జనార్ మాట్లాడుతూ యువత ప్రేమలో పడినప్పుడు ఎదుర్కొనే భావోద్వేగాలు, సమస్యలను కథాంశంగా తీసుకుని షార్ట్ ఫిలిం రూపొందించడం అభినందించదగ్గ విషయం అన్నారు.

ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు భాను ప్రకాష్, హసీనా, శ్రీ హర్ష, శ్యామ్, హరీష్, నాని, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.




Blogger ఆధారితం.