బండారు సత్యనారాయణ చారి మిత్రమండలి సేవలు అభినందనీయం: కిలారు నాగేశ్వరరావు

బండారు సత్యనారాయణ చారి మిత్రమండలి సేవలు అభినందనీయం: కిలారు నాగేశ్వరరావు

జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం :  శ్రీ చైత్ర అమావాస్య సందర్భంగా పాల్వంచ పటణంలోని నటరాజ్ సెంటర్‌లో బండారు సత్యనారాయణ చారి మిత్రమండలి ఆధ్వర్యంలో బుధవారం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.


ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ బీఆర్‌ఎస్ నాయకులు కిలారు నాగేశ్వరరావు హాజరై అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “మానవ సేవే మాధవ సేవ” అనే నినాదంతో బండారు సత్యనారాయణ చారి మిత్రమండలి ఆధ్వర్యంలో ప్రతినెల పితృ అమావాస్య నాడు అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బండారు శ్రీనివాస చారి, నరసింహారావు, రామాచారి, శివనారాయణ, వెంకటేశ్వర రెడ్డి, లింగాచారి, అప్పారావు, రాజు, వీరాచారి తదితరులు పాల్గొన్నారు.
Blogger ఆధారితం.