చరిత ఆర్గానిక్ కల్టివేషన్ అండ్ సోలార్ డ్రయర్స్ సంస్థకు రాష్ట్రస్థాయి అవార్డు
జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం: పాల్వంచకు చెందిన చరిత ఆర్గానిక్ కల్టివేషన్ అండ్ సోలార్ డ్రయర్స్ సంస్థకు రాష్ట్రస్థాయి గుర్తింపు లభించింది. జనజాతీయ గరిమా ఉత్సవ్–2026 కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేతుల మీదుగా సంస్థ నిర్వహణ అధికారి డాక్టర్ ఎస్. సోమరాజు దొరకు “బెస్ట్ ట్రైబల్ అచీవర్ అవార్డు–2026” ప్రదానం చేశారు.
కేవలం 18 నెలల క్రితం స్థాపించబడిన ఈ సంస్థ ఆర్గానిక్, నేచురల్ ఉత్పత్తుల సేకరణ, తయారీ రంగాల్లో నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ విశిష్ట సేవలు అందిస్తున్నందుకు ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకుంది.
ఈ సందర్భంగా డాక్టర్ ఎస్. సోమరాజు దొర మాట్లాడుతూ సంస్థ ప్రారంభించిన తక్కువ కాలంలోనే రాష్ట్రస్థాయి గుర్తింపు దక్కడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో మరింత నాణ్యమైన ఉత్పత్తులను వినియోగదారులకు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
అవార్డు ప్రదానోత్సవంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన ఉత్పత్తుల తయారీ ద్వారా ఆదర్శంగా నిలుస్తున్న చరిత ఆర్గానిక్ కల్టివేషన్ అండ్ సోలార్ డ్రయర్స్ సంస్థను ప్రత్యేకంగా అభినందించారు.

Post a Comment