కొత్తగూడెం 29వ డివిజన్ లో నూతన బోర్ ఏర్పాటు

కొత్తగూడెం 29వ డివిజన్ లో నూతన బోర్ ఏర్పాటు

జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం: కొత్తగూడెం పట్టణం  29వ డివిజన్ పరిధిలోని న్యూ గొల్లగూడెంలో ప్రజలకు తాగునీటి సమస్య తీరేలా మరో నూతన బోర్‌ను ఏర్పాటు చేశారు. డివిజన్ కార్పొరేటర్ మల్హోత్రా సాగర్ ఆధ్వర్యంలో డా. అలీ బాబా ఇంటి ముందు మూడో బోర్ పనులను ప్రారంభించారు. వేసవి కాలంలో ప్రజలకు అత్యవసరమైన త్రాగునీటిని అందించాలనే ఉద్దేశంతో ఈ బోర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ కార్పొరేటర్ మల్హోత్రా సాగర్‌కు కృతజ్ఞతలు తెలపగా...బోరు పనులను మాజీ కొత్తగూడెం స్పెషల్ జ్యూడిషల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ మెండు రాజమల్లు, షేక్ జానీ, ఎత్తు సమ్మయ్య, పాసికంటి రమేష్, బొమ్మిసెట్టి కిరణ్, రామాచారి, టెంట్ హౌస్ ప్రకాష్, మారపల్లి రవి, నీలం పుల్లయ్య, బుధారపు శ్రీను, బుధారపు వెంకన్న తదితరులు కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ కార్యకర్తలు మల్హోత్రా కుమార్, వేముల పవన్, లేతాకుల నాగరాజు, సాగంటి రవి, చింతల రాము, రేగుల రాజేష్, లగిశెట్టి ప్రసాద్, గుడిసె శ్రావణ్, బుధారపు చరణ్, మహమ్మద్ జఫ్ఫు, గుర్రాల సాయి, వెలిశాల పవన్‌తో పాటు డివిజన్ మహిళలు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.