అనర్హత పిటిషన్లపై కార్పొరేటర్లకు కొత్తగూడెం జిల్లా కోర్టు నోటీసులు
జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం : ఇటీవల జరిగిన కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచిన ఇద్దురు కార్పొరేటర్లను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ జిల్లా కోర్టులో రెండు ఎన్నికల పిటిషన్లు దాఖలయ్యాయి.
డివిజన్-47 (పాత పాల్వంచ), డివిజన్-54 (సఫాయి బస్తీ) ఎన్నికలను రద్దు చేయాలని పిటిషన్లు దాఖలయ్యాయి. డివిజన్-47లో గెలిచిన సిపిఐ అభ్యర్థి గుర్రం వెంకటేశ్వర్లుపై బీఆర్ఎస్ అభ్యర్థి మిర్యాల అలివేలు పిటిషన్ వేశారు. అలాగే డివిజన్-54లో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి జయంతి మసూద్‌పై బీఆర్ఎస్ అభ్యర్థి మాదాసు పద్మ పిటిషన్ దాఖలు చేశారు.
పిటిషనర్ల తరఫున న్యాయవాదులు యండి సాదిక్ పాషా, డి. సామంత్, సంకుబాపన అనుదీప్ వాదనలు వినిపించారు. వాదనలు పరిశీలించిన జిల్లా కోర్టు పిటిషన్లను స్వీకరించి ఈసీ నంబర్లు 2/2026, 3/2026గా నమోదు చేసింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి తదుపరి విచారణను మే 6కు వాయిదా వేసింది.

.webp)
Post a Comment