తాండ్ర వెంకటేశ్వరరావు మాతృమూర్తికి కాంగ్రెస్ రాష్ట్ర నేత కోనేరు చిన్ని నివాళులు

తాండ్ర వెంకటేశ్వరరావు మాతృమూర్తికి కాంగ్రెస్ రాష్ట్ర నేత కోనేరు చిన్ని నివాళులు

జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం:   ములకలపల్లి మండలం పొగళ్ళపల్లి  గ్రామానికి చెందిన ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వర్గీయ తాండ్ర నారాయణరావు సతీమణి, టిఎన్ఆర్ ట్రస్ట్ అధినేత తాండ్ర వెంకటేశ్వరరావు మాతృమూర్తి తాండ్ర లలితదేవి చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కోనేరు సత్యనారాయణ (చిన్ని) పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. 

ఈ  సందర్భంగా తాండ్ర లలితదేవి కుటుంబ సభ్యులకు కోనేరు చిన్ని తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో నారటి ప్రసాద్,59వ డివిజన్ కార్పొరేటర్ రావి రాంబాబు,55వ డివిజన్ కార్పొరేటర్ హరిహరన్  యాదవ్,మాలంపటి కిరణ్ కుమార్, సంతోష్ గౌడ్,వివిధ పార్టీల నాయకులు కుటుంబ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు

Blogger ఆధారితం.