పాల్వంచ నీట్స్ ఐటీఐలో అడ్మిషన్లకు ఆహ్వానం: ప్రిన్సిపాల్ దేవీలాల్
జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం: పాల్వంచ నీట్స్ ఐటీఐ కళాశాలలో 2026-2027 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ దేవీలాల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదో తరగతి ఉత్తీర్ణులై ఐటీఐలో చేరదలచిన విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొని ఒరిజినల్ ధృవపత్రాలను సమర్పించాలని సూచించారు. ఐటీఐలో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులకు మే 1 నాటికి 14 సంవత్సరాలు నిండి ఉండాలని స్పష్టం చేశారు.
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 14వ తేదీ నుంచి జూన్ 8వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. నీట్స్ ఐటీఐలో ఎలక్ట్రీషియన్ ట్రేడ్‌లో 80 సీట్లు, ఫిట్టర్ ట్రేడ్‌లో 40 సీట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
పూర్తి వివరాల కోసం 8985848939 నంబర్‌ను సంప్రదించాలని ప్రిన్సిపాల్ దేవీలాల్ కోరారు.

Post a Comment