టిపిసిసి సెక్రెటరీ రామా గౌడ్ కు ఎస్.జె.కె.అహ్మద్ తేనేటి విందు
జె.హెచ్.9.మీడియా, పాల్వంచ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎస్.జె.కె. అహ్మద్ స్వగృహంలో బుధవారం ఏర్పాటు చేసిన తేనేటి విందుకు టీపీసీసీ సెక్రటరీ రామా గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రామా గౌడ్‌ను ఎస్.జె.కె. అహ్మద్ మిత్రబృందం ఘనంగా సన్మానించి స్వాగతం పలికింది.
ఈ కార్యక్రమంలో టీయూఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎం.డి. మంజూర్, పాకాలపాటి కృష్ణయ్య చౌదరి కళాపీఠం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు రోషయ చౌదరి, తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి బుడగం నాగేశ్వరరావు, న్యూ పాల్వంచ మెగా ఫ్యాన్స్ అధ్యక్షుడు షేక్ ఖాసిం, జానపద కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు గద్దర్ భాష, ప్రైవేట్ పాఠశాలల జిల్లా అధ్యక్షుడు బండి లక్ష్మణ్,పి.ప్రసాద్, ఓం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment