ఐ.యల్.పి.ఏ జాతీయ కౌన్సిల్ సభ్యురాలిగా న్యాయవాది సుంకర భానుప్రియ

ఐ.యల్.పి.ఏ జాతీయ కౌన్సిల్ సభ్యురాలిగా న్యాయవాది సుంకర భానుప్రియ
జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం : ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ఐ.యల్.పి.ఏ) జాతీయ కౌన్సిల్ సభ్యురాలిగా కొత్తగూడెం బార్ అసోసియేషన్ సభ్యురాలు, మహిళా న్యాయవాది సుంకర భానుప్రియ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నాగపూర్‌లో జరిగిన జాతీయ మహాసభలో ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ జాతీయ కౌన్సిల్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

జాతీయ అధ్యక్షురాలిగా సుజాత చౌదంతే, జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.జే. సామ్సన్, కార్యవర్గ సభ్యురాలిగా సుంకర భానుప్రియను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

జ్యోతిరావు పూలే, డా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో ఆవిర్భవించిన ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ఐ.యల్.పి.ఏ) న్యాయవాదుల అభ్యున్నతి కోసం, వారి సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ, సమాజంలో అణగారిన వర్గాల ప్రజలకు రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలని, సమానత్వం, సమాన అవకాశాలు కల్పించాలని, సమసమాజ నిర్మాణం కోసం BAMCEF‌కు అనుబంధంగా పని చేస్తున్న సంస్థ అని సుంకర భానుప్రియ తెలిపారు.

పూలే-అంబేద్కర్ ఐడియాలజీ, “పే బ్యాక్ టు సొసైటీ” లక్ష్యంగా పనిచేస్తున్న ఐ.యల్.పి.ఏలో అందరూ సభ్యులుగా చేరి సమసమాజ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని భానుప్రియ పిలుపునిచ్చారు.

భానుప్రియ నియామకం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఖ్యాతిని జాతీయ స్థాయిలో మరోసారి నిలిపిందని ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర బాధ్యులు, న్యాయవాదులు జనపరెడ్డి గోపి కృష్ణ, మారపాక రమేష్, మహమ్మద్ సాదిక్ పాషా, డి. సామంత్, యెర్రా కామేష్, యెర్రాపాటి కృష్ణ హర్షం వ్యక్తం చేశారు.

Blogger ఆధారితం.