కోనేరు చిన్నికి రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలి - ఎస్.జె.కె.అహ్మద్

కోనేరు చిన్నికి రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలి - ఎస్.జె.కె.అహ్మద్

జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కోనేరు సత్యనారాయణ (చిన్ని)కు కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ పదవి కేటాయించి గౌరవించాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ ఎస్.జె.కె.అహ్మద్ కాంగ్రెస్ పార్టీ  అధిష్టానాన్ని  శుక్రవారం ఓ ప్రకటనలో కోరారు.

ఈ సందర్భంగా ఎస్.జె.కె.అహ్మద్  మాట్లాడుతూ  దివంగత మాజీ మంత్రి కోనేరు నాగేశ్వరరావు చూపిన ప్రజాసేవా మార్గంలో ఆయన తనయుడు కోనేరు సత్యనారాయణ (చిన్ని) కొనసాగుతున్నారని తెలిపారు. గత 30  ఏళ్లుగా ప్రజల మధ్య ఉంటూ..ప్రజాసమస్యల పరిష్కారం దిశగా కోనేరు చిన్ని కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

ఇటీవల జరిగిన కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కోనేరు చిన్నికి కేటాయించిన స్థానాలను అత్యధిక సంఖ్యలో గెలిపించుకొని తన మార్క్ చాటారు అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కొత్తగూడెం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావాలంటే త్వరలో భర్తీకానున్న రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవులలో కోనేరు చిన్నికి సముచిత స్థానం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

సౌమ్యుడిగా, ప్రజల మనిషిగా ఎల్లప్పుడూ పార్టీ ఆదేశాలు, సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తున్న కోనేరు సత్యనారాయణకు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తే కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ తోపాటు భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో మరింత అభివృద్ధి అవుతుందని స్పష్టం చేశారు. సేవా దృక్పథంతో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే కోనేరు చిన్నికి రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవి కేటాయిస్తే ప్రజలకు మేలు జరుగుతుందని ఎస్.జె.కె. అహ్మద్ పేర్కొన్నారు.

Blogger ఆధారితం.