సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం : కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కోనేరు చిన్ని
జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం : సమాజఅభివృద్ధి..దేశాభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కోనేరు సత్యనారాయణ (చిన్ని) అన్నారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కొత్తగూడెంలో ఆయన ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ బానోతు రాణి, మాజీ శ్రీనగర్ ఎంపీటీసీ కొల్లు పద్మ, లక్ష్మీదేవిపల్లి ఎంపీటీసీ తేజావత్ భద్రమ్మ, అంగన్‌వాడీ టీచర్లు పుష్ప, అంజలి, విజయశ్రీ, అశ్విని, అంజమ్మ, విజయలక్ష్మి, చిన్నదేవి, శ్రీలతలను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం కోనేరు చిన్ని మాట్లాడుతూ మహిళలు కుటుంబానికి మాత్రమే కాకుండా సమాజ అభివృద్ధికి కూడా కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. విద్య, ఉపాధి, రాజకీయాలు, సామాజిక సేవ వంటి అన్ని రంగాలలో మహిళలు తమ ప్రతిభను చాటుతూ ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. మహిళల సాధికారత సమాజ అభివృద్ధికి పునాది అని, వారు ధైర్యంగా తమ లక్ష్యాలను సాధించాలన్నారు. అమ్మగా, అక్కగా, చెల్లిగా, బిడ్డగా ప్రతి పాత్రలో మహిళలు సమర్థంగా వ్యవహరిస్తూ కుటుంబానికి, సమాజానికి మంచి పేరు తీసుకొస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు రావి రాంబాబు, హరిహర యాదవ్, కొండలరావు, బావ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment