నక్సలైట్ల లొంగుబాటుపై మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఆసక్తికర వ్యాఖ్యలు

నక్సలైట్ల లొంగుబాటుపై మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఆసక్తికర వ్యాఖ్యలు

జె.హెచ్.9.మీడియా,  హైదరాబాద్: మావోయిస్టులు ఆయుధాలను వీడి ప్రజాక్షేత్రంలోకి రావాలని, అందులో భాగంగానే డీజీపీ శివధర్ రెడ్డి నేతృత్వంలో నక్సలైట్ల లొంగుబాటు అభినందించదగ్గ విషయమని జీహెచ్‌ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ అన్నారు.  మంగళవారం బోరబండలో జరిగిన క్రైస్తవుల ఆత్మీయ సమావేశంలో నక్సల్స్ లొంగుబాటుపై బాబా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీజీపీ శివధర్ రెడ్డిని గాంధీతో పోలుస్తూ, ఒకప్పుడు మహాత్మా గాంధీ పిలుపుతో శాంతి, అహింస ద్వారానే భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చుకున్నామని, అలాగే డీజీపీ శివధర్ రెడ్డి ఆధ్వర్యంలో నక్సలైట్లు ఆయుధాలను వదిలి జనజీవన స్రవంతిలోకి వచ్చి ప్రజా పాలనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మావో కీలక నేతలందరూ సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ శివధర్ రెడ్డి పై అపారమైన నమ్మకంతో ప్రజాక్షేత్రంలోకి రావడం శుభపరిణామమని బాబా ఫసియుద్దీన్ తెలిపారు.


Blogger ఆధారితం.