విధులు బహిష్కరించిన న్యాయవాదులు

విధులు బహిష్కరించిన న్యాయవాదులు

జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం :  హైదరాబాద్‌లోని అత్తాపూర్‌కు చెందిన న్యాయవాది మహమ్మద్ ఖదీర్ దారుణ హత్యకు నిరసనగా ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ ఫర్ తెలంగాణ ఇచ్చిన పిలుపు మేరకు కొత్తగూడెం బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు జనపరెడ్డి గోపీకృష్ణ అధ్యక్షతన సోమవారం అత్యవసర సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా న్యాయవాది మహమ్మద్ ఖదీర్ హత్యకు నిరసనగా కొత్తగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులను బహిష్కరించారు. అనంతరం ఉపాధ్యక్షుడు జనపరెడ్డి గోపీకృష్ణ ఆధ్వర్యంలో కోర్టు గేట్ బయట ప్లకార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఉపాధ్యక్షుడు జనపరెడ్డి గోపీకృష్ణ మాట్లాడుతూ న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవాదుల రక్షణకు అవసరమైన అన్ని చర్యలు తక్షణమే తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయవాదుల సంరక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయకపోతే ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ ఫర్ తెలంగాణ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఆందోళనలు చేపడతామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో న్యాయవాదులు హన్మంతరావు, చిరంజీవిరావు, పి. నాగేశ్వరరావు, కే. పుల్లయ్య, మన్మోహన్, యెర్రాపాటి కృష్ణ, శ్రీధర్, మహమ్మద్ సాదిక్ పాషా, మారపాక రమేష్, మహేష్, చిన్ని కృష్ణ, విజయ్, రమేష్, ఎర్ర శ్రీను, మధన్ మోహన్, కేపీ తదితరులు పాల్గొన్నారు.



Blogger ఆధారితం.