కొహిర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ హస్త గతం

కొహిర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ హస్త గతం

జె.హెచ్.9.మీడియా, హైదరాబాద్ :  కొహిర్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయంలో, అలాగే చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు కాంగ్రెస్ పార్టీకి దక్కడంలో ఎండీ. బాబా ఫసియుద్దిన్ (మాజీ కార్పొరేటర్, బోరబండ; మాజీ డిప్యూటీ మేయర్, జిహెచ్‌ఎంసీ; మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్) కీలక పాత్ర వహించారు.

కొహిర్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడంలో అచంచలమైన కృషి, కఠినమైన శ్రమ పార్టీ విజయానికి మూలాధారంగా నిలిచాయి.

ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం అనంతరం చైర్మన్ మ్యాతరి ఆశోక్, వైస్ చైర్మన్ అద్నాన్ జావీద్, వార్డ్ కౌన్సిలర్లు ఎండీ. బాబా ఫసియుద్దిన్‌ను అభినందించి, హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు. ఆయన నాయకత్వం, అంకితభావం కొహిర్ ప్రజల అభివృద్ధికి సహయ సహకారాలు అందించాలని ఆకాంక్షించారు.



Blogger ఆధారితం.