7వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించండి -ఎస్.జె.కె.అహ్మద్

ప్రజా సంక్షేమమే కాంగ్రెస్‌ ప్రభుత్వ ధ్యేయం: ఎస్.జె.కె. అహ్మద్
జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం :  7వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ పాల్వంచ పట్టణ నాయకులు ఎస్.జె.కె. అహ్మద్ కోరారు. సోమవారం పాల్వంచ పట్టణ పరిధి 7వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చల్లగుండ్ల సుజాత గెలుపును కాంక్షిస్తూ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు.

డివిజన్‌లోనిప్రతి ఇంటికి అహ్మద్  వెళ్లి కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.  

ఈ సందర్భంగా ఎస్.జె.కె.అహ్మద్ మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తున్న పథకాలు పేద, మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయన్నారు.డివిజన్ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని, ప్రజల సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ అందుబాటులో ఉండేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని ఎస్.జె.కె. అహ్మద్ పేర్కొన్నారు. 7వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను ఆయన కోరారు. ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే డివిజన్ మరింత వేగంగా అభివృద్ధి చేకూరుతుందని తెలిపారు.


అనంతరం 7వ డివిజన్‌లో రోడ్ షో కు హాజరైన ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డిని ఎస్.జె.కె.అహ్మద్ ఘనంగా  సన్మానించి జై కాంగ్రెస్, జై పొంగులేటి, జై రేవంత్ రెడ్డి అంటూ  నినాదాలు ఇస్తూ హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.



Blogger ఆధారితం.