ముగ్గుల పోటీలు విజయవంతం చేయండి -నూకల రంగారావు
జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం : సంక్రాంతి సంబరాల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ముగ్గుల పోటీలలో అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పాల్వంచ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల రంగారావు ఆదివారం ఒక ప్రకటనలో కోరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముగ్గుల పోటీలు సోమవారం సాయంత్రం 3 గంటల నుంచి పాల్వంచ పట్టణంలోని కేటీపీస్ విద్యుత్ కళా భారతి గ్రౌండ్ నందు జరగనున్నట్లు ఆయన వివరించారు. ముగ్గుల పోటీలకు మొత్తం రూ.1,25,000/- ప్రైజ్ మనీ కేటాయించగా, పోటీల్లో పాల్గొనే ప్రతి ఒక్కరికీ ప్రత్యేక బహుమతి అందజేయనున్నట్లు తెలిపారు. పాల్వంచ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 27 డివిజన్లకు చెందిన మహిళలందరూ ఈ పోటీల్లో పాల్గొనవచ్చని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రెవిన్యూ, హౌసింగ్ శాఖామాత్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డితో పాటు ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురామ్ రెడ్డి హాజరవుతున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమానికి మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ సంక్రాంతి ముగ్గుల పోటీలను విజయవంతం చేయాలని ఆయన కోరారు

Post a Comment