సూరజ్ తివారి ఆధ్వర్యంలో ఘనంగా ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలు
జె.హెచ్.9.మీడియా, హైదరాబాద్: : ఏఐసీసీ అగ్ర నాయకురాలు, ఎంపీ ప్రియాంక గాంధీ పుట్టినరోజు వేడుకలను ఆదివారం టీపీసీసీ ప్రోటోకాల్ కార్యదర్శి సూరజ్ తివారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీభవన్ లో కేక్ కట్ చేసి, అక్కడి కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ వీహెచ్ హనుమంత రావు, ప్రభుత్వ సలహాదారుడు హార్కర వేణుగోపాల్ హాజరయ్యారు. అలాగే టీపీసీసీ ఉపాధ్యక్షులు కైలాష్, టీపీసీసీ ఉపాధ్యక్షులు ఆలం భాస్కర్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొని ప్రియాంక గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Post a Comment