ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత- ఎస్.జె.కె. అహ్మద్

ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత- ఎస్.జె.కె. అహ్మద్
.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం : ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత చేకూరుతుందని నేతాజీ యువజన సంఘం అధ్యక్షుడు ఎస్.జె.కె. అహ్మద్ అన్నారు. ఆదివారం పాల్వంచ పట్టణ పరిధి 7వ డివిజన్ వనమా కాలనీలో నెలకొన్న శ్రీశ్రీశ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి ధర్మపీఠ క్షేత్రం పీఠాధిపతి గురు స్వామి అచ్చయ్య నాయక్ ఇరుముడి కార్యక్రమ మహోత్సవం గుడి కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. 

ఈ సందర్భంగా  అయ్యప్ప శబరి యాత్రకు బయలుదేరుతున్న గురు స్వామి అచ్చయ్య నాయక్‌ను నేతాజీ యువజన సంఘం అధ్యక్షుడు ఎస్.జె.కె. అహ్మద్ సన్మానించారు.  

అనంతరం ఎస్.జె.కె. అహ్మద్ మాట్లాడుతూ.. దైవ కార్యక్రమాలు విశ్వశాంతికి దోహదం చేస్తాయని పేర్కొన్నారు. ప్రజలందరూ ఆనందంగా, ప్రతి ఇల్లు సిరి సంపదలతో ఉండాలని ఆ భగవంతుడిని వేడుకున్నారు. 

అచ్చయ్య నాయక్ మాట్లాడుతూ ఆలయం వ్యవస్థాపక సమయంలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఆ అయ్యప్పస్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆయన ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో స్థానికులు సక్రూ నాయక్, నరేష్, సురేష్, చిట్టిబాబు, రాజు, బంగారి, సక్కుబాయి, అనిత, దేవి, మనీ, సునీత, చందు, మౌనిక, సాయి, గమ్మి, భూలక్ష్మి, హైమావతి, అశోక్, ప్రసాద్, ప్రియాంక, జ్యోతి, జూలియా, సరోజ, తేవ్యా, భూక్య చిన్న, కృష్ణ, స్వాతి, భక్తులు తదితరులు పాల్గొన్నారు.



Blogger ఆధారితం.