కాంగ్రెస్ లీగల్ సెల్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన జిల్లా జడ్జి పాటిల్ వసంత్

జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ లీగల్ సెల్ నూతన సంవత్సర 2026 కోర్ట్ క్యాలెండర్‌ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ ఆవిష్కరించారు.
కొత్తగూడెం జిల్లా కోర్టు ప్రాంగణంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ లీగల్ సెల్ ఛైర్మన్ యేల్లంకి వెంకటేశ్వరరావు, జిల్లా కన్వీనర్ పడిసిరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి వసంత్ పాటిల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2026 నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలను జిల్లా ప్రజలకు తెలియజేశారు. నూతన సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. అలాగే కక్షిదారులు రాజీ మార్గాన్ని ఎంచుకుని కేసులను త్వరితగతిన పరిష్కరించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి కిరణ్ కుమార్, అదనపు సీనియర్ సివిల్ జడ్జి కవిత, జూనియర్ సివిల్ జడ్జిలు సుచరిత, రవికుమార్, సూరేడ్డి,
టీపీసీసీ లీగల్ సెల్ జిల్లా నాయకులు ఆర్. విజయ్ కుమార్, వై. బాబూరావు, జి. మహేష్, వి. సుధాకర్, పప్పుల ప్రసాద్, గడదాసు నాగరాజు, మాలోత్ ప్రసాద్, కె. కుమార్, దొడ్డ ప్రసాద్, తెల్లబోయిన రమేష్, కె. నవీన్, దేవదాస్, జి. శాంత, అన్నపూర్ణ, పావని, మహాలక్ష్మి రూప, శాంతి తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.
Post a Comment