సయ్యద్ రషీద్ కు ఘన సన్మానం

సయ్యద్ రషీద్ కు ఘన సన్మానం

జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం: ఇబ్ నే అబ్బాస్ సామాజిక సేవా సంస్థ వార్షికోత్సవం సందర్భంగా ఇబ్ నే అబ్బాస్ కమిటీ ఆధ్వర్యంలో జై తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సయ్యద్ రషీద్ ను ఘనంగా సన్మానించారు. 

ఈ సందర్భంగా ఇబ్ నే అబ్బాస్ కమిటీ బాధ్యులు సయ్యద్  ఆసిఫ్ మాట్లాడుతూ కరోనా విపత్కర సమయం నుండి నేటి వరకు తమ సంస్థ చేస్తున్న అనేక సామాజిక సేవా కార్యక్రమాలకు సయ్యద్ రషీద్ తోడ్పాటును అందిస్తున్నారని అన్నారు. రషీద్ సహకారంతో ఇలానే భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సయ్యద్ అర్షద్, షేక్ అంజద్, అబ్దుల్ రహీం, ఎండి సద్దాం, సోహల్, అజ్మత్, ఉబ్బెన శ్రీను, అరివెల్లి పెద్దిబాబు, జిల్లేపల్లి స్టాలిన్, షేక్ ఇమ్రాన్, షేక్ ఇబ్రహీం, రాఘవులు, తదితరులు పాల్గొన్నారు

Blogger ఆధారితం.