తెలుగు రాష్ట్రాల్లో స్వల్ప భూ ప్రకంపనలు

తెలుగు రాష్ట్రాల్లో స్వల్ప భూ ప్రకంపనలు

జె.హెచ్.9. మీడియా, వెబ్ డెస్క్  :  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బుధవారం ఉదయం 7.27 గంటలకు కొన్ని సెకన్లపాటు పలుచోట్ల స్వల్ప ప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు భయంకరనకు గురై ఇళ్లు, అపార్ట్‌మెంట్లు నుంచి బయటకు పరుగులు తీశారు.

ములుగు జిల్లా మేడారం‌లో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దీన్ని తీవ్రత రిక్టర్ స్కేలు పై 5.0గా నమోదైనట్లు హైదరాబాద్‌లోని సీఏసీఐఆర్ - ఎన్ జీ ఆర్ ఐ శాస్త్రవేత్తలు వెల్లడించారు. భూకంప కేంద్రం నుంచి 225 కిలోమీటర్ల పరిధిలో ప్రకంపనలు ప్రభావం కనిపించింది.

ఆంద్రప్రదేశ్ లోని విజయవాడ, విశాఖపట్నం, జగ్గయ్యపేట, నందిగామ, ఏలూరు సహా పలు ప్రాంతాల్లో భూమి కనిపించింది. 

తెలంగాణలో హైదరాబాద్ నగరాల్లోని పలు ప్రాంతాలతో పాటు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్, జనగామ జిల్లాల పరిధిలో ప్రకంపనలు వచ్చాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 సెకండ్లపాటు ప్రకంపరులు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. హైదరాబాద్ నగర పరిధిలోని వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ పరిసర ప్రాంతాలతో పాటు మరికొన్ని జిల్లాల్లో భూమి కంపించినట్లు తెలుస్తోంది


Blogger ఆధారితం.