పిల్లలకు మాదకద్రవ్యాల గురించి ఆవగాహన కల్పించాలి : సఖీ రమాదేవి

పిల్లలకు మదకద్రవ్యల గురించి ఆవగాహన కల్పించాలి : సఖీ రమాదేవి

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం:  అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మిదేవిపల్లి మండలంలోని శ్రీరామచంద్ర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సఖీ ఉమెన్ ప్రొటెక్షన్ & వెల్ఫేర్ ఫౌండేషన్ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి మాట్లాడుతూ… ప్రస్తుతం మదకద్రవ్యాల దుర్వినియోగానికి అతి చిన్న వయసు పిల్లలు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

చాక్లెట్ల రూపంలో డ్రగ్స్ ను అందించడంతో మైనర్ పిల్లలు కూడా అనుకోకుండా మత్తుకు అలవాటవుతున్నారని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు చిన్ననాటి నుంచే పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు బాధ్యతగా వ్యవహరిస్తే ఈ సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని సూచించారు.

డ్రగ్స్ బాధితుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న రిహాబిలిటేషన్ సెంటర్ల సదుపాయాలను వినియోగించుకోవాలని, బాధితులను గుర్తించిన వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1908 కు సమాచారం ఇవ్వాలని సూచించారు. మదకద్రవ్యాల బారిన పడిన కుటుంబాలు భయపడాల్సిన అవసరం లేదని, బాధితులకు ధైర్యం చెప్పి చికిత్స కోసం రిహాబిలిటేషన్ సెంటర్లలో చేర్చాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ రహిత సమాజం నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై ముందుకు రావాలన్నారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, పారాలీగల్ వాలంటీర్ తులసి, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.