మత్తు పదార్థాల వినియోగంతో జీవితం అంధకారం : న్యాయమూర్తి కె.కవిత
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: మత్తు పదార్థాల వినియోగంతో జీవితం అంధకారంలో కూరుకుపోతుందని, డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు యువత, విద్యార్థులు దూరంగా ఉండాలని కొత్తగూడెం అదనపు సీనియర్ సివిల్ జడ్జి కె. కవిత అన్నారు.
అంతర్జాతీయ మాదకద్రవ్యా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం కొత్తగూడెంలోని శ్రీ రామచంద్ర ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన న్యాయ చైతన్య కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ "యువత అనేక సార్లు మానసిక బాధలు ఎదురైనపుడు మత్తు పదార్థాలపై ఆధారపడుతున్నారు. దీని ఫలితంగా వారు వ్యసనాలకు బానిసలవుతున్నారు. విద్యార్థి దశలో నుంచే క్రమశిక్షణతో, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. డ్రగ్స్ వినియోగం సమాజానికి పెద్ద సమస్యగా మారుతోంది. యువతను రక్షించడంలో ప్రతి ఒక్కరూ తమ పాత్రను నిర్వర్తించాలి" అని పేర్కొన్నారు.
తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై నిత్యం నిఘా పెట్టాలని ఆమె సూచించారు. అనంతరం విద్యార్థులతో డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ వి. పురుషోత్తమరావు, డిప్యూటీ కౌన్సిల్ పి. నిరంజన్ రావు, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్ సాహితీ, పావని, కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పి. పద్మ, డి. రమేష్, వైస్ ప్రిన్సిపల్ డా. ఎం. పూర్ణ, యాంటీ డ్రగ్స్ కమిటీ కన్వీనర్ చందర్ రావు, డా.ఎన్. శ్రీదేవి, పి. శ్రీనివాసరావు, న్యాయవాదులు ఎండి సాధిక్ పాషా, మారపాక రమేష్ కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Post a Comment