సజ్జన్ సమాజ్ ఇంటర్నేషనల్ కార్యక్రమాలు అభినందనీయం - పాల్వంచ డిఎస్పి
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: మత్తు వ్యసనాలకు వ్యతిరేకంగా చైతన్యం కల్పించేలా సజ్జన్ సమాజ్ చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్ అన్నారు. మంగళవారం మత్తు పదార్థాల వినియోగాన్ని నిరోధించేందుకు సజ్జన్ సమాజ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో చేపట్టిన డ్రగ్స్ వ్యతిరేక వారోత్సవాల్లో భాగంగా పాల్వంచ డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ సతీష్ కుమార్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ "యువత మత్తు పదార్థాలకు బానిసై తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు అని అన్నారు. యువత చదువుపై దృష్టి పెట్టి, తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా ఉన్నత స్థాయికి ఎదగాలని, సమాజ పట్ల బాధ్యతాయుతంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సజ్జన్ సమాజ్ ఇంటర్నేషనల్ జిల్లా కన్వీనర్ ఎం.ఎ.రజాక్, ఉపాధ్యక్షులు వినుకొండ శ్రీనివాసరాజు, కార్యదర్శి ఖాజా హుస్సేన్, సభ్యులు జానీ, హైమద్ సోహైల్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment