రెండవ విడత పంచాయతీ ఎన్నికలు: ఉదయం 11 గంటల వరకు జిల్లాలో నమోదైన పోలింగ్ శాతం

రెండవ విడత పంచాయతీ ఎన్నికలు: ఉదయం 11 గంటల వరకు జిల్లాలో నమోదైన పోలింగ్ శాతం

జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం :   కొత్తగూడెం జిల్లాలో జరుగుతున్న రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా, ఆదివారం ఉదయం 11.00 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. జిల్లాలోని అన్నపురెడ్డిపల్లి, అశ్వారావుపేట, చంద్రుగొండ, చుంచుపల్లి, దమ్మపేట, ములకలపల్లి, పాల్వంచ మండలాల్లో పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు.


జిల్లాలో మొత్తం 1,96,395 మంది ఓటర్లు ఉండగా, అందులో 1,13,064 మంది ఓటర్లు ఉదయం 11.00 గంటల వరకు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం పోలింగ్ శాతం 57.57%గా నమోదయిందని చెప్పారు. మండలాల వారీగా పోలింగ్ శాతం ఇలా ఉంది: అన్నపురెడ్డిపల్లి 64.63%, అశ్వారావుపేట 68.56%, చంద్రుగొండ 60.85%, చుంచుపల్లి 37.49%, దమ్మపేట 64.85%, ములకలపల్లి 65.45%, పాల్వంచ 46.23%.


జిల్లాలో ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగిస్తున్నారని కలెక్టర్ తెలిపారు. పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం ఒకటికి ముగియనుండడంతో, ఇంకా ఓటు వేయని ఓటర్లు సమీప పోలింగ్ కేంద్రాలకు చేరుకొని తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించాలని విజ్ఞప్తి చేశారు.


పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టబడ్డాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని ఆయన తెలిపారు.

Blogger ఆధారితం.