పాల్వంచ పట్టణ సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం - ఎమ్మెల్యే కూనంనేని
జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం: పాల్వంచ మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రకుంట, మున్సిపల్ కార్యాలయం రోడ్, బీసీఎం రోడ్, ఇందిరా కాలనీ, నెహ్రూ నగర్ ప్రాంతాల్లో రూ.1 కోటి 7 లక్షల నిధులతో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ ప్రతి బస్తీలో రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులపై పూర్తిస్థాయిలో దృష్టి సారించి నిధులు వెచ్చిస్తున్నామని తెలిపారు. రహదారులు, త్రాగునీరు, విద్యుత్ సమస్యలకు పూర్తిస్థాయిలో పరిష్కారం చూపించి తీరుతామని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని, ఒక్కొక్కటిగా ప్రతి పనిని పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
పాల్వంచ, కొత్తగూడెం మున్సిపాలిటీలను కలిపి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసుకున్నామని, కార్పొరేషన్ ఏర్పాటుతో నగరాలకు దీటుగా పాల్వంచ మున్సిపాలిటీని అభివృద్ధి పరుస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ధారా ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ కె. సుజాత, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ముత్యాల విశ్వనాథం, జిల్లా కార్యవర్గ సభ్యులు వీసంశెట్టి పూర్ణచంద్రరావు, ఉప్పుశెట్టి రాహుల్, జిల్లా సమితి సభ్యులు వి. పద్మజ, డి. సుధాకర్, నిమ్మల రాంబాబు, ఇట్టి వెంకట్రావు, నాయకులు శనగారపు శ్రీనివాసరావు, వై.ఎస్. గిరి, వల్లపు యాకయ్య, గౌస్, రెహమాన్, కరీం, రమేష్, గణేష్, ఆదినారాయణ, పాల్వంచ ఎస్‌ఐ, ఎలక్ట్రికల్ ఏడీఈ, ఇరిగేషన్ డీఈ, పట్టణ ఆర్‌ఐ, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Advertising:


Post a Comment