బీసీ రిజర్వేషన్ల బిల్లుకు మోకాలడ్డుతున్న మోదీ - వీసంశెట్టి పూర్ణచంద్రరావు

బీసీ రిజర్వేషన్ల బిల్లుకు మోకాళ్లడుతున్న మోదీ - వీసంశెట్టి పూర్ణచంద్రరావు

జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం: తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలును కేంద్రంలోని మోదీ ప్రభుత్వం  మోకాలడ్డుతోందని, రిజర్వేషన్ల అంశంపై కేంద్రం రాజకీయాలు చేయడం సరైంది కాదని, ఇలాంటి చర్యలు బీసీల పట్ల కేంద్రానికి ఉన్న వ్యతిరేక వైఖరిని బహిర్గతం చేస్తున్నాయని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీసంశెట్టి పూర్ణచంద్రరావు అన్నారు.

పాల్వంచలోని స్థానిక చండ్ర రాజేశ్వరరావు భవన్‌లో గురువారం ప్రజాసంఘాల నాయకులతో 18న జరగబోయే బంద్‌ సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉభయ సభల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించి గవర్నర్‌ ఆమోదానికి పంపారని, ఆ బిల్లును ఆమోదించి ఆర్డినెన్స్‌ ఇవ్వకుండా మోదీ ప్రభుత్వం తొక్కిపట్టిందని ఆరోపించారు.

చట్టసభలు, అన్నివర్గాల ప్రజలు విస్తృతంగా మద్దతు తెలిపినా, ఇంత స్పష్టమైన ప్రజాభిప్రాయాన్ని కేంద్రం పట్టించుకోకపోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన విమర్శించారు.

బీసీ వర్గాలకు న్యాయం చేయడంలో మోదీ ప్రభుత్వం వెనుకడుగు వేస్తోందని, బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోందని అన్నారు. బీసీల అభ్యున్నతి దేశ ప్రగతికి కీలకమని ఆయన స్పష్టం చేశారు.

42 శాతం రిజర్వేషన్ల అంశంపై రాజకీయ లాభనష్టాల కోసం ఆటలు ఆడకూడదని హెచ్చరించారు. రిజర్వేషన్ల బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు.

బీసీల హక్కులను కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, బీసీల హక్కుల కోసం సిపిఐ మరింత బలమైన ఉద్యమాన్ని కొనసాగిస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రజలను రాజకీయంగా విభజించే కుట్రలను తిప్పికొడతామని హెచ్చరించారు.

బీసీ జేఏసీ తలపెట్టిన అక్టోబర్‌ 18 రాష్ట్రవ్యాప్త బంద్‌ను సిపిఐ సంపూర్ణంగా బలపరుస్తుందని ప్రకటించారు. బంద్‌లో అన్ని ప్రజాసంఘాలు, కార్మిక, రైతు, విద్యార్థి సంఘాలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అడుసుమిల్లి సాయిబాబా, జిల్లా సమితి సభ్యులు గుండాల నాగరాజు, వి. పద్మజ, డి. సుధాకర్, వీసంశెట్టి విశ్వేశ్వరరావు, వరక అజిత్, అన్నారపు వెంకటేశ్వర్లు, నిమ్మల రాంబాబు, ఇట్టి వెంకట్రావు, శనగారపు శ్రీనివాసరావు, నరహరి నాగేశ్వరరావు, వల్లపు యాకయ్య, జకరయ్య, సంజీవరావు, చెన్నయ్య, కొంగర అప్పారావు, బీవీ సత్యనారాయణ, ఇరుకు రామారావు, ఆదినారాయణ, కరీం, పత్తి వేంకటేశ్వర్లు, కోమటి శ్రీనివాసరావు, మురళి నాయక్, గౌస్, టైలర్‌ బాబు, వెంకన్న, అల్లి వెంకటేశ్వర్లు తదితర నాయకులు పాల్గొన్నారు.

Advertising:

Blogger ఆధారితం.