బీసీ బంద్‌ను విజయవంతం చేయండి - నూకల రంగారావు

బీసీ బంద్‌ను విజయవంతం చేయండి - నూకల రంగారావు

జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్‌తో శనివారం జరగనున్న బంద్‌ను పాల్వంచలో విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నూకల రంగారావు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ బీసీ బంద్‌కు మద్దతు తెలుపాలని కోరారు. పట్టణంలోని అన్ని డివిజన్ల నుండి కాంగ్రెస్ కార్యకర్తలు కదిలి బీసీ హక్కుల కోసం బలమైన సంకేతాన్ని ఇవ్వాలన్నారు.

బంద్ సందర్భంగా శాంతియుతంగా వ్యవహరించాలని రంగారావు కోరారు. బంద్ విజయవంతం చేయడానికి సమాజంలోని అన్ని వర్గాలు, కాంగ్రెస్ కార్యకర్తలు సహకరించాలని పిలుపునిచ్చారు.


Advertising:

Blogger ఆధారితం.