వృద్ధుల పట్ల ఆత్మీయతను చూపాలి - న్యాయాధికారి ఎం.రాజేందర్

వృద్ధుల పట్ల ఆత్మీయతను చూపాలి - న్యాయాధికారి ఎం. రాజేందర్

జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం:   కొత్తగూడెం, రైటర్ బస్తీలోని శ్రీ సత్య సాయి వృద్ధాశ్రమాన్ని గురువారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయాధికారి ఎం. రాజేందర్ సందర్శించారు. వృద్ధాశ్రమంలో నివసిస్తున్న వృద్ధుల ఆరోగ్య పరిస్థితులు, బాగోగులు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “వృద్ధాప్యం శాపం కాదు. వృద్ధులు తమ జ్ఞానం, అనుభవంతో సమాజ అభివృద్ధికి కీలకంగా తోడ్పడతారు” అని పేర్కొన్నారు. వృద్ధ తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత వారి కుమారులపై ఉందని, వారు నిర్లక్ష్యం వహించినట్లయితే సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ యాక్ట్ ప్రకారం ఆర్డీవో కోర్టులో వృద్ధులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

సీనియర్ సిటిజన్లు ఇప్పుడు కోరుకునేది పెద్దగా ఏమీ ఉండదని, వారికి  ఒక చిన్న  ప్రేమపూర్వక పలకరింపు,ఆత్మీయత చాలు అని ఆయన అన్నారు. సీనియర్ సిటిజన్లకు న్యాయ సంబంధిత సమస్యలు ఏవైనా ఉంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (District Legal Services Authority) కు దరఖాస్తు చేయడం ద్వారా ఉచితంగా పరిష్కారం పొందవచ్చని న్యాయాధికారి తెలిపారు.

Advertising:


Blogger ఆధారితం.