పాల్వంచ: కొల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రేపు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం

పాల్వంచ: కొల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రేపు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం

జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం :   కొల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాల్వంచ పట్టణంలో ఈ నెల 23, 24 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని నిర్వహించనున్నట్లు ఆర్గనైజింగ్ కమిటీ బాధ్యులు మల్లెల రవిచంద్ర, కల్పనా చౌదరి కొల్లి, రుప్లా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బసవతారకం ఇండో–అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సహకారంతో కొల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాల్వంచ కిన్నెరసాని రోడ్‌లోని అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఈ ఉచిత శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల బృందం, అత్యాధునిక వైద్య పరికరాలతో క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హైదరాబాద్ కాకతీయ కమ్యూనిటీ ఫౌండేషన్ చైర్మన్ గూడూరు సత్యనారాయణ, అనుబోస్ విద్యాసంస్థల చైర్మన్ తలసీల భరత్ హాజరుకానున్నట్లు తెలిపారు.

30 ఏళ్లు పైబడిన మహిళలు, పొగాకు లేదా మద్యం సేవించే వారు, కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర ఉన్నవారు, శరీరంలో అసాధారణ లక్షణాలు గమనిస్తున్న వారు తప్పనిసరిగా ఈ శిబిరంలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. క్యాన్సర్‌ను ప్రాథమిక దశలో గుర్తిస్తే సులభంగా నయం చేయవచ్చని, చికిత్స ఖర్చులు తగ్గడంతో పాటు జీవన ప్రమాణం మెరుగుపడుతుందని తెలిపారు. లక్షణాలు లేకపోయినా ముందస్తు జాగ్రత్తగా క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవడం ఎంతో అవసరమని వివరించారు.

పూర్తి వివరాలకు 94940 42013, 86395 12063, 96664 41906 నంబర్లను సంప్రదించాలని కోరారు.
Blogger ఆధారితం.