బాలికలు ఆత్మవిశ్వాసంతో ఎదగాలి - మేజిస్ట్రేట్ మెండు రాజమల్లు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికల పట్ల సమాజంలో ఇంకా కొనసాగుతున్న అసమానతలు, వివక్ష, భద్రతా లోపాలు వంటి సమస్యలను ఎదుర్కొనేందుకు అవగాహన అవసరమని తెలిపారు. బాలికల విద్య, వైద్య సేవలు, పోషణ, రక్షణ వంటి హక్కులను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రతీ సంవత్సరం అక్టోబర్ 11న అంతర్జాతీయ బాలిక దినోత్సవం నిర్వహించడం వెనుక ఉద్దేశ్యం — బాలికల హక్కుల పరిరక్షణతో పాటు సమాజంలో సమానత్వాన్ని నెలకొల్పడమే అని ఆయన అన్నారు.అదేవిదంగా సమాచార హక్కు చట్టం (RTI) గురించి కూడా అవగాహన కల్పించారు.
అనంతరం బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గోపికృష్ణ మాట్లాడుతూ ప్రతి బాలిక తన ప్రతిభతో సమాజంలో మార్పుకు దారితీయగలదని అన్నారు. కాలం ఎంతో విలువైనదని, విద్యార్థినులు పట్టుదలతో, సమయస్ఫూర్తితో, ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగి అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. బాలురు లేదా బాలికలు ప్రమాదంలో ఉన్నప్పుడు వెంటనే చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 లేదా అత్యవసర నంబర్లు 100, 112 ద్వారా సమాచారం ఇవ్వాలని విద్యార్థినులకు సూచించారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ బాలల భద్రతలో భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ భాగం మాధవరావు, సీడబ్ల్యూసీ సభ్యుడు సాదిక్ పాషా, కళాశాల ప్రిన్సిపాల్ పి. అనురాధ, వైస్ ప్రిన్సిపల్ ఆర్. సంగీత, అధ్యాపకులు పుష్ప, రమ్య, సునీత, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.
Advertising:



Post a Comment