మానసిక ప్రశాంతతతో సంపూర్ణ ఆరోగ్యం – లక్కినేని సత్యనారాయణ

మానసిక ప్రశాంతతతో సంపూర్ణ ఆరోగ్యం – లక్కినేని సత్యనారాయణ

జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం:   అనవసర ఆలోచనలకు దూరంగా ఉంటే మానసిక ప్రశాంతత లభిస్తుందని, తద్వారా పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ అన్నారు.

శుక్రవారం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చుంచుపల్లి ప్రభుత్వ హై స్కూల్‌లో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యక్తి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంతే ముఖ్యమని అన్నారు. ప్రస్తుత వేగవంతమైన జీవనశైలి, ఒత్తిడి, ఆందోళనల కారణంగా చాలా మంది మానసికంగా ఇబ్బంది పడుతున్నారని, డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలు పెరుగుతున్నాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సుజాతనగర్ ప్రైమరీ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బి. రమేష్, కొత్తగూడెం స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ మెండు రాజమల్లు, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ పురుషోత్తం రావు, పి. నిరంజన్ రావు, సాహితీ పాల్గొన్నారు.


Advertising:



Blogger ఆధారితం.