జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి – న్యాయాధికారి రాజేందర్
జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం: కొత్తగూడెం జిల్లా కోర్టులో సెప్టెంబర్ 13న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయాధికారి ఎం.రాజేందర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరికైనా కేసులు ఉన్నా వాటిని రాజీ (కాంప్రమైజ్) పద్ధతిలో ఈ లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చని సూచించారు. యాక్సిడెంట్ కేసులు, సివిల్ కేసులు, చీటింగ్ కేసులు, చిట్ ఫండ్ కేసులు, భూ తగాదాలకు సంబంధించిన కేసులు, వివాహ బంధానికి సంబంధించిన కేసులు, చిన్నచిన్న దొంగతనాల కేసులు, ట్రాఫిక్ ఛలాన్లు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, కుటుంబ తగాదాలు, బ్యాంకు లావాదేవీల కేసులు, టెలిఫోన్ బకాయిల కేసులు, గొడవలకు సంబంధించిన కేసులు, సైబర్ క్రైమ్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు వంటి వివిధ అంశాలకు సంబంధించి మధ్యవర్తిత్వం ద్వారా కేసులను పరిష్కరించుకునే అవకాశాన్ని కక్షిదారులు వినియోగించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.
ఈ లోక్ అదాలత్ ద్వారా కేసులు పూర్తిగా క్లోజ్ అయ్యే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ దానిని సద్వినియోగం చేసుకోవాలని న్యాయాధికారి ఎం.రాజేందర్ తెలిపారు.
Advertising:


Post a Comment