పాల్వంచ డీఎస్పీకి ఘన సన్మానం

పాల్వంచ డీఎస్పీకి ఘన సన్మానం

జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం:  మహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవం మిలాద్-ఉన్-నబి సందర్భంగా పాల్వంచ మర్కజీ జామా మస్జిద్ అహలే సున్నత్ వల్ జమాత్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయగా, ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


ఈ సందర్భంగా భద్రతా ఏర్పాట్లలో పూర్తి సహకారం అందించిన పాల్వంచ డీఎస్పీ సతీష్, ఎస్ఐ, సీఐలకు ముస్లిం మైనార్టీ నాయకులు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ఇబ్రహీం ఖురేషి,అక్బర్ అలీ, మస్తాన్ ఖురేషి, ఫారుక్, యాకూబ్ ఖురేషి, గౌస్, ఖాసిం, హర్షద్ తదితరులు పాల్గొన్నారు.

Advertising:



Blogger ఆధారితం.