భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఒకే రోజులో వేల కేసులు పరిష్కారం

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఒకే రోజులో వేల కేసులు పరిష్కారం

జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం:   కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో మొత్తం 4,576 కేసులు పరిష్కారం అయ్యాయి. రాజీమార్గం ద్వారా వివాదాలు ముగిసిన కేసుల సంఖ్య ఎక్కువగా ఉండడం విశేషంగా నిలిచింది.

జిల్లా కోర్టు పరిధిలోని కొత్తగూడెంలో 2,333 కేసులు పరిష్కరించబడ్డాయి. ఇందులో సివిల్ కేసులు 32 ఉండగా, 24 మోటార్ వాహన ప్రమాద కేసుల్లో రూ.1 కోటి 32 లక్షల 85 వేల పరిహారం మంజూరయ్యింది. అదనంగా క్రిమినల్ కేసులు 2,023, బ్యాంకులకు సంబంధించిన పీఎల్‌సీ కేసులు 278 తేల్చబడ్డాయి.

ఇల్లందులో 507 కేసులు క్లియర్ అయ్యాయి. వీటిలో సివిల్ 12, క్రిమినల్ 363, పీఎల్‌సీ 132 ఉన్నాయి.

భద్రాచలంలో 1,180 కేసులు పరిష్కరించబడ్డాయి. వీటిలో క్రిమినల్ 1,106, పీఎల్‌సీ 74 ఉన్నాయి.

మణుగూరులో మొత్తం 556 కేసులు తేల్చబడ్డాయి. వీటిలో క్రిమినల్ 489, పీఎల్‌సీ 67 ఉన్నాయి.

జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విజయవంతంగా జరిగిన ఈ లోక్ అదాలత్‌లో న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీసులు సమన్వయంతో పనిచేశారు. కక్షిదారులకు సౌకర్యాల కల్పనలో ప్రభుత్వ యంత్రాంగం, బ్యాంకులు సహకరించాయి.


Advertising










Blogger ఆధారితం.