రైతులకు భోజన వసతి ఏర్పాటుచేసిన కాంపెల్లి కనకేష్ పటేల్
- రైతన్నల కడుపు నింపిన కనకేష్ పటేల్
- కాంగ్రెస్ పాలనలో మళ్లీ యూరియా కష్టాలు
- యూరియా అందించలేకపోతే గద్దె దిగండి – కాంపెల్లి
ఈ సందర్భంగా కాంపెల్లి కనకేష్ పటేల్ మాట్లాడుతూ రైతే దేశానికి వెన్నుముక అని, వారు ఆకలితో ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులు మళ్లీ యూరియా కోసం క్యూ లైన్‌లలో నిలబడి కష్టాలు పడుతున్నారని విమర్శించారు.
కేసీఆర్ పాలనలో తొమ్మిదిన్నరేళ్లు రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కావలసినంత యూరియాను అందించారని గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రైతులకు వెంటనే యూరియా అందించకపోతే ప్రభుత్వం గద్దె దిగాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు సంగ్లోత్ రంజిత్, మారుమూళ్ల కిరణ్, కొత్తచెరువు హర్షవర్ధన్, పూజాల ప్రసాద్, ఆలకుంట శోభన్, అడపా సత్యనారాయణ, తోట లోహిత్ సాయి, పోసారపు అరుణ్, కుమ్మరికుంట్ల వినోద్, గోవాడ గుణచరిత్, గజ్జెల రితిక్, కొండే మనోజ్, కూరెళ్లి మురళీమోహన్, ఆలి, బర్ల క్రాంతి, కొమ్మాలపాటి నిఖిల్, గడ్డం శ్రీకాంత్, తోట సతీష్ తదితరులు పాల్గొన్నారు.


Post a Comment