ఘనంగా హిందీ భాషా దినోత్సవ వేడుకలు

ఘనంగా హిందీ భాషా దినోత్సవ వేడుకలు

జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం:  పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్)లో హిందీ భాషా దినోత్సవ ముగింపు ఉత్సవాలు బుదవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పద్మ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు హిందీ భాష నేర్చుకోవడం ద్వారా దేశవ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు.

అనంతరం కళాశాల హిందీశాఖా అధ్యక్షురాలు డాక్టర్ టి.అరుణకుమారి మాట్లాడుతూ హిందీ ప్రపంచం మెచ్చిన భాష అని పేర్కొన్నారు. విద్యార్థులు తరచూ హిందీలో మాట్లాడితే అనేక ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు. 

ఇందులో భాగంగా కళాశాలలో మూడు రోజులుగా జరిగిన హిందీ దినోత్సవ వేడుకల్లో వ్యాసరచన, ఉపన్యాస, క్విజ్, స్పీడ్ రీడింగ్ పోటీలను నిర్వహించగా, విజేతలకు బహుమతులు, మెడల్స్‌ను అందజేశారు.  ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు  పాల్గొన్నారు.


Advertising:

Blogger ఆధారితం.