జాతీయస్థాయి నృత్య పోటీల పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే కూనంనేని

జాతీయస్థాయి నృత్య పోటీల పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే కూనంనేని

జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం:  పాల్వంచలోని శ్రీ సంతోషిని నాట్య నిలయం ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో భద్ర శైల డాన్స్,మ్యూజికల్ కాంపిటీషన్స్ నవంబర్ 8, 9 తేదీల్లో శ్రీ సీతారామ కళ్యాణ మండపంలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ క్రమంలో బుధవారం కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు  కూనంనేని సాంబశివరావు ఆయన క్యాంప్ కార్యాలయంలో జాతీయస్థాయి నృత్య పోటీల పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా శ్రీసంతోషిని నాట్య నిలయం వ్యవస్థాపకులు రమాదేవి రామ్ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా కేవలం కూచిపూడి, ఫోక్ నృత్య పోటీలను మాత్రమే నిర్వహించగా, ఈసారి కూచిపూడి, భరతనాట్యం, ఫోక్ డాన్స్, కర్ణాటక సంగీతం తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్టు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో పోటీల కోఆర్డినేటర్ దొడ్డ రాంబాబు, పలువురు తల్లిదండ్రులు పాల్గొన్నారు.


Advertising

Blogger ఆధారితం.