ఎన్.ఐ. యాక్ట్ పై అవగాహన సదస్సు
జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం:కొత్తగూడెం జిల్లా కోర్టులోని బార్ అసోసియేషన్ లైబ్రరీ హాల్ లో నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టం (ఎన్.ఐ. యాక్ట్)పై అవగాహన సదస్సును శనివారం ఆల్‌ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు.
కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ మాట్లాడుతూ కేసులు గెలవాలంటే న్యాయవాదులు నిరంతరం చదవాలని, నిత్య విద్యార్థిగా ఉండాలని సూచించారు.
ఈ సదస్సుకు ప్రధాన వక్తగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీనియర్ న్యాయవాది, బార్ కౌన్సిల్ సభ్యుడు సుంకర రాజేంద్ర ప్రసాద్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ మ్యాండేటరీ నోటీసు యొక్క ప్రాముఖ్యతను వివరించారు. కేసులో “నోటీసు ఇవ్వడం ఎంత ముఖ్యమో, కేసు గెలవడానికి న్యాయవాది అధ్యయనం ఎంత చేశారో అన్నది కూడా అంతే ముఖ్యమని” అన్నారు.
అనంతరం బార్ కౌన్సిల్ సభ్యుడు కొల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై ఎన్.ఐ. చట్టం ప్రాముఖ్యతను వివరించారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, ఐలు కోర్టు కమిటీ ఉపాధ్యక్షుడు తెల్లబోయిన రమేష్, కొత్తగూడెం జిల్లా కోర్టు ఐలు ప్రధాన కార్యదర్శి కే. పురుషోత్తం రావు, కొత్తగూడెం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కే. కిరణ్ కుమార్, అదనపు సీనియర్ సివిల్ జడ్జి కర్నాటి కవిత, ఫస్ట్ అడిషనల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కే. సాయి శ్రీ, రెండవ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ బి. రవికుమార్, అఖిల భారత న్యాయవాదుల సంఘం నేషనల్ కౌన్సిల్ సభ్యుడు జే. శివరాం ప్రసాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐలు కమిటీ అధ్యక్షుడు యం.వి. ప్రసాదరావు, ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ మక్కడ్, రాష్ట్ర సహాయ కార్యదర్శి పొనుగోటి కిషన్ రావు, రాష్ట్ర కమిటీ సభ్యులు మందడపు శ్రీనివాసరావు, మీసాల వెంకటేశ్వర్లు, రాష్ట్ర మహిళా వింగ్ సభ్యులు జి.కే. అన్నపూర్ణ, టి. సునంద, కొత్తగూడెం కోర్టు కమిటీ గౌరవాధ్యక్షుడు కే. పుల్లయ్య, అధ్యక్షుడు ఆర్. రామారావు, ప్రధాన కార్యదర్శి కే. పురుషోత్తం రావు, ఉపాధ్యక్షులు పిట్టల రామారావు, టి. సునంద, కోశాధికారి డి. రవికుమార్, సంయుక్త కార్యదర్శులు ఏ. రవికుమార్, ఉప్పు అరుణ్, ఇతర కమిటీ సభ్యులు పి. రవి, ఎస్. రామారావు, జే. మదన్ మోహన్, అరకాల కరుణాకర్, నంబూరి రామకృష్ణ, డి. రాజేందర్, కే.వి. అభిలాష్, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.
Advertising:



Post a Comment