మెరుగైన సమాజం ఏర్పాటుకు ఉపాధ్యాయులే కీలకం - ఎంపీడీవో విజయభాస్కర్ రెడ్డి

మెరుగైన సమాజం ఏర్పాటుకు  ఉపాధ్యాయులే కీలకం - ఎంపీడీవో విజయభాస్కర్ రెడ్డి
జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం:  మెరుగైన సమాజ నిర్మాణం జరగడానికి, అలాగే శాస్త్ర–సాంకేతిక రంగాలన్నిటిలో ముందడుగు పడాలంటే ఉపాధ్యాయుల ద్వారానే సాధ్యమవుతుందని పాల్వంచ మండల అభివృద్ధి అధికారి విజయభాస్కర్ రెడ్డి అన్నారు.

ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన పాల్వంచ మండలంలోని 21 మంది టీచర్స్ కి సోమవారం పాల్వంచ, బొల్లూరుగూడెం ఉన్నత పాఠశాలలో ఘన సన్మానం చేశారు.

ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ  “సమాజంలో ఉన్న వృత్తులన్నిటికన్నా ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవనీయమైనదని అన్నారు. పిల్లలను ఉత్తమ పౌరులుగా  తీర్చిదిద్ది సమాజ నిర్మాణానికి కృషి చేసే వారు ఉపాధ్యాయులే. అలాంటి ఉత్తమ ఉపాధ్యాయులను ప్రతి సంవత్సరం ఎంపిక చేసి సన్మానం చేయడం గర్వకారణం” అని పేర్కొన్నారు.


పాల్వంచ మండలంలోని వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన జి. రత్నకుమారి, పి. కమలాకర్, వి. లక్ష్మి, బి. మాధవి, కె. కృష్ణమూర్తి, పి. అరుణ, బి. నాగమహాలక్ష్మి, ఎస్. రామరావు, వి. ఉమారాణి, ఎం. సందీప్, బి. అనురాధ, కె. సుధాకర్, బి. శ్రీనివాసరావు, వై. ప్రవీణ్‌కుమార్, పి. లీలా మాధురి, టి. శ్రీనివాసరెడ్డి, ఎ. వాత్సల్య, 
కె. పద్మజ, ఎన్. రాము, ఎం.డి. షాజియా తబస్సుమ్, జె. రామ్‌ప్రసాద్‌లకు ఆయన చేతుల మీదుగా శాలువాలు కప్పి, మోమెంటోలు అందజేసి ఘనంగా సన్మానం చేశారు.

ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి ఎ. శ్రీరామమూర్తి, మాధవరావు, కాంప్లెక్స్ హెడ్‌మాస్టర్లు ప్రకాశ్‌రావు, పద్మలత, కుమారి, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.


Advertising




 

Blogger ఆధారితం.