కాంపెల్లి కనకేష్ పటేల్ ఆధ్వర్యంలో రెండవ రోజు రైతులకు భోజన సదుపాయం ఏర్పాటు

కాంపెల్లి కనకేష్ పటేల్ ఆధ్వర్యంలో రెండవ రోజు రైతులకు భోజన సదుపాయం ఏర్పాటు

జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం: యూరియా బస్తాల కోసం పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ కార్యాలయం వద్ద ఉదయం నుండి క్యూలైన్లలో వేచి ఉన్న రైతులకు మంగళవారం (రెండవ రోజు) బిఆర్ఎస్ జిల్లా నాయకులు, పాల్వంచ కో - ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్ భోజన సదుపాయం కల్పించారు. సుమారు 250 మంది రైతులకు భోజనం వడ్డించగా, వారికి ఒడ్డుగూడెం దివ్యశ్రీ ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ యజమాని తోట సతీష్ ఉచిత మినరల్ వాటర్ అందజేశారు. ఈ సందర్భంగా కనకేష్ పటేల్ మాట్లాడుతూ “పాల్వంచ మండలంలోని దూర ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు ఉదయం నుండి సాయంత్రం వరకు క్యూలో వేచి ఉంటున్నారు అని అన్నారు. వారికి మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేయడం సంతృప్తిని కలిగిస్తోందన్నారు. ఇకపై యూరియా అందించే ప్రతిరోజూ ఈ సేవను నిరంతరంగా కొనసాగిస్తాను” అని తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పాల్వంచ పట్టణ బిఆర్ఎస్ అధ్యక్షుడు మంతపురి రాజు గౌడ్ మాట్లాడుతూ “గత 45 రోజులుగా యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. రైతులకు సరిపడా యూరియా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతుల ఇబ్బందులను గుర్తించి స్వయంగా తన సొంత డబ్బులతో భోజన సదుపాయం కల్పించడం కనకేష్ పటేల్ సేవలు అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు సంగ్లోత్ రంజిత్, మారుమూళ్ల కిరణ్, కొత్తచెరువు హర్షవర్ధన్, పూజాల ప్రసాద్, ఆలకుంట శోభన్, గంగాధరి పుల్లయ్య, వల్లపిన్ని వెంకటేశ్వర్లు, పోసారపు అరుణ్, కుమ్మరికుంట్ల వినోద్, గజ్జెల రితిక్, కొండే మనోజ్, కూరెళ్లి మురళీమోహన్, ఆలి, సిహెచ్ ప్రవీణ్, కొమ్మాలపాటి నిఖిల్, గడ్డం శ్రీకాంత్, తోట సతీష్ తదితరులు పాల్గొన్నారు.


Advertising




 



Blogger ఆధారితం.