దేశం గర్వించదగిన గొప్ప గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం – కొత్వాల

దేశం గర్వించదగిన గొప్ప గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం – కొత్వాల
జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం: గొప్ప గాయకుడిగా భారతదేశం యావత్తు గర్వించదగిన మహోన్నత వ్యక్తి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అని రాష్ట్ర మార్క్‌ఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. గానగాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వర్థంతి సందర్భంగా ఖాసిం మెగా ఈవెంట్స్, శ్రీ వెంకటేశ్వర కళానాట్య మండలి, పాల్వంచ కళాకారుల ఆధ్వర్యంలో బాలు వర్థంతిని నిర్వహించారు. గురువారం స్థానిక మున్సిపల్ రోడ్‌లోని ఓ హోటల్ లో బాలసుబ్రహ్మణ్యం పాటల కచేరీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కొత్వాల్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఆయన బాలసుబ్రహ్మణ్యం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ  తన పాటలతో తెలుగు రాష్ట్రాలను ఉర్రూతలూగించిన గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అని అన్నారు. వేలాది మంది కళాకారులను ప్రోత్సహించి వారిని గాయకులుగా తీర్చిదిద్దిన వ్యక్తి ఎస్పీ అని కొత్వాల అన్నారు.

ఈ కార్యక్రమంలో ఖాసిం మెగా ఈవెంట్స్ నిర్వాహకులు ఎస్‌.కె. ఖాసిం,శ్రీ వెంకటేశ్వర కళానాట్య మండలి అద్యక్షులు ఎస్‌.కె. భాషా, కళాకారులు పాకాలపాటి రోశయ్య చౌదరి, వేముల కొండలరావు, రసూల్, సిరిదు, మౌలా, మహబూబ్, వసంత్, మోహన్, రాంబాబు,పాతూరి రామ్మోహన్ రెడ్డి,  బిఆర్‌ఎస్ పాల్వంచ పట్టణ అద్యక్షులు మంతపురి రాజు గౌడ్, బి.ఆర్.ఎస్. మహిళా నాయకురాలు సింధు తపస్వి, కాంగ్రెస్ నాయకులు పైడిపల్లి మహేష్, ఎస్‌వీఆర్‌కే ఆచార్యులు, వై. వెంకటేశ్వర్లు, కాపర్తి వెంకటాచారి, ఎస్‌.కె. చాంద్ పాషా, డీష్ నాగేశ్వరరావు, సందు ప్రభాకర్, ధర్మసోత్ ఉపేందర్ నాయక్, , సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.
Blogger ఆధారితం.