సీతారాం ఏచూరి చిత్రపటానికి సిపిఎం నాయకుల నివాళి
జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం: సీపీఎం పార్టీ ఆల్ ఇండియా మాజీ కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని బుధవారం జూలూరుపాడు మండల సీపీఎం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సిపిఎం పార్టీ భద్రాద్రికొత్తగూడెం జిల్లా కమిటీ సభ్యుడు కొండపల్లి శ్రీధర్...సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ “మార్క్సిస్టు, లెనినిస్ట్ సిద్ధాంతాలను నిర్దిష్ట పరిస్థితులకు అన్వయిస్తూ భారతదేశానికే కాకుండా శ్రీలంక వంటి దేశాలకు కూడా దిశానిర్దేశం చేసిన మహామేధావి ఏచూరి అని అన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతోన్మాదానికి వ్యతిరేకంగా తుది శ్వాస వరకు పోరాడిన గొప్ప వ్యక్తి సీతారాం ఏచూరి అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నాయకులు యాసా నరేష్, గారపాటి వెంకట్, భూక్యా మధు, గడదేశి కనకరత్నం, లక్ష్మయ్య, బోడ అభిమిత్రా, గోవిందు, తాటి పద్మ తదితరులు పాల్గొన్నారు.
Advertising:


Post a Comment