అస్థికల సమస్య పిల్లలకు వారసత్వంగా మిగలకూడదు – అనితా బోస్
ఈ సందర్భంగా అనితా బోస్ మాట్లాడుతూ తన తండ్రి అస్థికలను భారత్ కు తెప్పించేందుకు గతంలో పీవీ నరసింహారావు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను గుర్తు చేసుకున్నారు. ఆ ప్రయత్నాలను మోదీ ప్రభుత్వం పూర్తి చేసి, నేతాజీ అస్థికలు భారత్‌కు చేరేలా చూడాలని కోరారు. వయసు రిత్యా ప్రస్తుతం నేతాజీ అస్థికలను పొందడం తనకు చాలా ముఖ్యమని భావోద్వేగానికి గురయ్యారు. ఈ అంశాన్ని ఇప్పటికైనా త్వరగా ముగించాలని, ఈ సమస్యను తన పిల్లల వారసత్వంగా ఇవ్వాలని అనుకోవడం లేదని అన్నారు. నేతాజీ అస్థికలు కుటుంబానికి మాత్రమే కాదు దేశానికి కూడా చెందినవని కూడా ఆమె స్పష్టం చేశారు.
మిస్టరీగానే నేతాజీ అంతిమ ఘట్టం..
1945 ఆగస్టు 18న తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ మరణించినట్లు పలు దర్యాప్తు నివేదికలు చెబుతున్నాయి. నేతాజీ మరణంపై భారత ప్రభుత్వం వేసిన రెండు దర్యాప్తు కమిషన్లు.. ఆయన తైపీలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించినట్లు చెప్పగా, జస్టిస్ ఎంకే ముఖర్జీ నేతృత్వంలోని కమిషన్ మాత్రం వాటితో విబేధించింది. ఆ ప్రమాదం జరిగిన తర్వాత కూడా నేతాజీ బతికే ఉన్నారని పేర్కొంది. దీంతో నేతాజీ మరణం, రెంకోజీ ఆలయంలో ఉన్న అస్థికలు నేతాజీవా? కావా? అన్న విషయం ఓ మిస్టరీగానే మిగిలిపోయింది.
మరి ఈ అంశంపై ప్రధాని మోదీ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి..
Advertising:


Post a Comment