జిల్లా ప్రధాన న్యాయమూర్తిని మర్యాదపూర్వకంగా కలిసిన మెజిస్ట్రేట్ దుర్గా భవాని

జిల్లా ప్రధాన న్యాయమూర్తిని మర్యాదపూర్వకంగా కలిసిన మెజిస్ట్రేట్ దుర్గా భవాని


జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం:  తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్ పంజాగుట్టలోని శ్రీనగర్ కాలనీకి చెందిన దుర్గా భవాని భద్రాచలం అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్‌గా నియమితులయ్యారు. శుక్రవారం ఆమె భద్రాచలం ప్రిన్సిపల్ జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ వి. శివ నాయక్ నుండి బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా మెజిస్ట్రేట్ దుర్గా భవాని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్‌ను జిల్లా కోర్టులో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.

Advertising:


Blogger ఆధారితం.