ఆచార్య జయశంకర్ జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి - ఉద్యమకారులు

ఆచార్య జయశంకర్ జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి - ఉద్యమకారులు
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: ఆచార్య జయశంకర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని,ఆయన జీవిత చరిత్రను,త్యాగాలను పాఠ్యాంశాల్లో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ఉద్యమకారులు డిమాండ్ చేసారు. బుధవారం తెలంగాణ సిద్దాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలను పాల్వంచలో  ఉద్యమకారుడు బుడగం నాగేశ్వరరావు అధ్యక్షతన  ఘనంగా నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆచార్య జయశంకర్ చిత్రపటానికి ఉద్యమకారులు పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి దిక్సూచిగా స్వరాష్ట్రం కోసం నిరంతరం తపించిన మహోన్నత వ్యక్తి ఆచార్య జయశంకర్  అని కొనియాడారు. రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఆయన చేసిన త్యాగాలను స్మరించుకున్నారు.ఆచార్య జయశంకర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని,ఆయన జీవిత చరిత్రను,త్యాగాలను పాఠ్యాంశాల్లో చేర్చాలన్నారు. ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు సయ్యద్ రషీద్,బరగడి దేవదానం,నబీ సాహెబ్,రవూఫ్,శ్రీ పాద సత్యనారాయణ,శనగ వెంకటేశ్వర్లు,యస్.డీ.టీ హుస్సేన్,కుడికాల ఆంజనేయులు,గొడ్ల మోహన్ రావు,ఉబ్బన శ్రీను, వీరభద్రం, షేక్ బాషా , బాబా,శనగ రామచందర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.